
రైతులను ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేక చతికిలపడిందని..ముఖ్యంగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్‌ను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను మంగళవారం ఉదయం 9గంటలకు ధర్నా చౌక్ వద్ద ప్రజలకు వివరించడంతో పాటు ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు వివరించారు. ఉల్మాలకు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంపై వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీలందరితో కలిసి సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆమె చెప్పారు.
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు
నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా