
ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫారెస్ట్ అధికారుల ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ ఆదివారం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ఖాజావలి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్‌కు పరీక్ష ఉంటుందని, దీనికి 7,655 మంది హాజరవుతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు జరగనున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,492 మంది హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని 10 కేంద్రాలను పరీక్షల నిర్వహణకు కేటాయించామని, వీటికి సీనియర్ డెప్యూటీ తహసీల్దార్లు లైజనింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని వివరించారు. పరీక్ష కేంద్రాలు, ఇతర సమాచారం పొందేందుకు అభ్యర్థులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 0863–2234014ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు గంట ముందు హాజరుకావచ్చన్నారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు చూపాలని ఆయన తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను అనుమతించమని చెప్పా రు. సమావేశంలో వెస్ట్ జోన్ డీఎస్పీ అరవింద్, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
7న ఫారెస్ట్ అధికారుల
ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్