
గుంటూరు వైద్య కళాశాలలో రీసెర్చ్ జర్నల్ ఏర్పాటు
గుంటూరు మెడికల్: రాష్ట్రంలోనే పేరొందిన గుంటూరు మెడికల్ కళాశాల మరొక కీలక అడుగు ముందుకు వేసింది. శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి నేతృత్వంలో ప్రఖ్యాత శాసీ్త్రయ ప్రచురణ సంస్థ సైంటిఫిక్ స్కాలర్స్‌కు చెందిన పబ్లిషర్ ప్రితేష్‌తో రీసెర్చ్ జర్నల్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి తొలి జర్నల్ సంచిక విడుదల అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాలేజీ నుంచి ప్రపంచానికి ఎంతోమంది ప్రముఖ వైద్యులు వెళ్లారని, ఇప్పుడు సాంకేతిక పరిశోధనకు ప్రాధాన్యతనిచ్చే జర్నల్ ద్వారా కళాశాల ఘనతను మరింతగా పెంచతామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వైద్య పరిశోధనలను ఈ జర్నల్ ద్వారా ప్రచురించడం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధన పట్ల మరింత ఆసక్తిని పెంచుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, పలు విభాగాల సహాయక ఆచార్యులు పాల్గొన్నారు.