
మంగళగిరిలో
మంగళగిరి పరిధిలోని ఇందిరానగర్‌లో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌లో స్కూల్, కళాశాలల విద్యార్థులు ఉంటున్నారు. గతంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పడేసి కొత్త హాస్టల్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో ఆ హాస్టల్ ఎదురుగానే ఉన్న ఓ ప్రభుత్వ భవనంలోకి వీరందరినీ తరలించారు. పాఠశాల విద్యార్థులు 78 మంది ఉండగా వారికి మూడు గదులు కేటాయించారు. అవి సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా బాత్‌రూములు లేవు. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
మంగళగిరి పరిధిలోని కొప్పురావు కాలనీ వద్ద ఎస్సీ బాలుర హాస్టల్‌లో 15 మంది విద్యార్ధులు ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానం ఉన్నాయి. వాటిని శుభ్రం చేసే వారే కరువయ్యారు.

మంగళగిరిలో