
కట్టుబాట్ల పేరుతో కుల పెద్దల ఆంక్షలు
నగరంపాలెం: కట్టుబాట్ల పేర్లతో కుల పెద్దలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పరిశీలించారు. బాధితుల మొరను అలకించారు. సంబంధిత ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్), మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కూడా ఫిర్యాదులు స్వీకరించారు.
ఓ కుటుంబ సభ్యుల ఆవేదన
న్యాయం చేయాలని వినతి