
కుండపోత
గుంటూరు
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
ఆదర్శ న్యాయ‘జ్యోతి’
శాకంబరిగా భవానీ అమ్మవారు
సత్తెనపల్లి: ఆషాఢ మాసం పురస్కరించుకొని స్థానిక అమ్మిశెట్టివారివీధిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి గుడిలో భవానీ అమ్మవారు శుక్రవారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 563.10 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది.
పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
బొల్లాపల్లి: వినుకొండ నుంచి 20 మందితో మర్రివేముల వెళుతున్న ఆర్టీసీ బస్సు వెల్లటూరు వద్ద ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఎవరూ గాయపడలేదు.
ప్రత్తిపాడు: మండలంలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రితోపాటు శుక్రవారం ఉదయం నుంచి కూడా విడతలవారీగా 40.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం మొదలు ప్రత్తిపాడు బస్టాండు వరకు గుంటూరు–పర్చూరు పాత మద్రాసు రోడ్డు చెరువును తలపించింది. మోకాలి లోతులో నీరు రోడ్లపై ప్రవహించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాగులు, లోలెవల్ చప్టాలు ఉప్పొంగాయి. గొట్టిపాడు– ప్రత్తిపాడు, గనికపూడి– గొట్టిపాడు మధ్యనున్న లోలెవల్ చప్టాలపై వర్షపు నీరు ఉప్పొంగింది. ఆయా గ్రామాల మధ్య రాకపోకలు కొన్ని గంటలపాటు స్తంభించిపోయాయి. ప్రత్తిపాడు, పాతమల్లాయపాలెం, ఏబీపాలెం, వంగిపురం ప్రాంతాల్లో సాగు భూములు సైతం వర్షపు నీటితో చెరువులను తలపించాయి. గుంటూరు – పర్చూరు పాత మద్రాసు రోడ్డుపై ప్రత్తిపాడులో ఎస్‌ఎంఎస్ అండ్ ఎన్‌ఎల్ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న లోలెవల్ చప్టాపై పెద్ద ఎత్తున నీరు ఉప్పొంగడంతో బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నివాసాల్లోకి మురుగునీరు..
ప్రత్తిపాడు ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రత్తిపాడు ప్రధాన రహదారిలో పాతమల్లాయ పాలెం కూడలి వద్దనున్న చిన్న తూముల వలన రెడ్ల రామాలయం నుంచి ఇందిరాగాంధీ బొమ్మ సెంటరు వరకు వర్షపు నీరు, మురుగు ఎగదన్ని ఇళ్లలోనికి, అంతర్గత వీధుల్లోకి వచ్చింది. ఇంటి సామగ్రి దెబ్బతింది. రోడ్లపై నీరు మోకాలి లోతులో ప్రవహించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తూముల సమస్యను అధికార యంత్రాంగం పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో అధిక వర్షాలకు సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై ప్రత్తిపాడు పంచాయతీ అధికారులకు కూడా శుక్రవారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
విదేశాల్లోనూ శిక్షణ
7
న్యూస్‌రీల్
చర్యలకు వెనకడుగు
ఇటీవల జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి చికిత్స కోసం వచ్చిన సమయంలో ఓ మెడికల్ ఆఫీసర్ రెండు కాళ్లు లేబుల్ మీద పెట్టి సెల్‌ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ అతడిపై డీఎంహెచ్‌ఓ కార్యాలయం చర్యలు తీసుకోలేదు. మరో వైద్య అధికారి మద్యం తాగి విధులకు హాజరవుతూ దుర్భాషలాడుతున్నారని పలువురు వైద్య సిబ్బంది డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఆరోగ్య కేంద్రాలకు రాని కొందరు వైద్య అధికారులను మార్చాలని ప్రజలు, రోగులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే లేరు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
లోతట్టు ప్రాంతాలు,
సాగు భూములు జలమయం
గుంటూరు–పర్చూరు పాత మద్రాసు
రోడ్డులో మునిగిన లోలెవల్ చప్టా
మూడు జిల్లాల మధ్య
నిలిచిపోయిన రాకపోకలు
ప్రత్తిపాడులో తూముల సమస్యతో
ఇళ్లలోకి చేరిన మురుగునీరు

కుండపోత

కుండపోత

కుండపోత

కుండపోత

కుండపోత

కుండపోత

కుండపోత

కుండపోత

కుండపోత