‘స్వచ్ఛ’ అవార్డు రావడం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ అవార్డు రావడం అభినందనీయం

Jul 19 2025 3:38 AM | Updated on Jul 19 2025 3:38 AM

‘స్వచ

‘స్వచ్ఛ’ అవార్డు రావడం అభినందనీయం

గుంటూరు వెస్ట్‌ / నెహ్రూనగర్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాకు అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు నగరానికి వచ్చిన అవార్డును జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్‌ చల్లా ఓబులేసు శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు చూపారు. ఇది సమష్టి కృషి ఫలితం అని కలెక్టర్‌ అన్నారు.

కేంద్రం నుంచి ‘సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ సిటీస్‌ 2024–25’ పోటీల్లో గుంటూరుకు లభించిన అవార్డు నగర ప్రజలు, ప్రజారోగ్య కార్మికులకు అంకితమని మేయర్‌ కె.రవీంద్ర చెప్పారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవార్డు అందించిన స్ఫూర్తితో సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. కమిషనర్‌ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అందరి కృషితోనే గుర్తింపు లభించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.

ముగిసిన పవిత్రోత్సవాలు

పెదకాకాని: శివాలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకల చివరిరోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, 20వ తేదీన శ్రీ భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి విశేష పూజలు చేయనున్నారు. స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు, ప్రధాన అర్చకులు పొత్తూరి లక్ష్మీనారాయణ వరప్రసాదు, దాతలు నేలవెల్లి కోటేశ్వరి, కర్నే శివ సందీప్‌ నాగశిరీష, రెడ్డి నవీన్‌ కుమార్‌ విజయలక్ష్మి, నేలివెల్లి నాగప్రత్యూష, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

వాటర్‌ గ్రిడ్‌ స్థలాన్ని

పరిశీలించిన పల్నాడు కలెక్టర్‌

విజయపురి సౌత్‌: మేకల గొంది నుంచి జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.1,200 కోట్లతో మాచర్ల నియోజకవర్గంతోపాటు పల్నాడు ప్రాంతానికి కూడా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత స్థలాన్ని అధికారులు పరిశీలించారు. మేకల గొందిలో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసే స్థలంలో సర్వే మ్యాపులను పరిశీలించారు. అన్ని అనుమతులు మంజూరయితే నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ వి.మురళీకృష్ణ, డీఎఫ్‌ఓ సందీప్‌ కుమార్‌, మాచర్ల తహసీల్దార్‌ కిరణ్‌ కుమార్‌, ఇరిగేషన్‌ ఈఈ రమేష్‌ పాల్గొన్నారు.

చౌడేశ్వరి అమ్మవారికి

సారె సమర్పణ

రెంటచింతల: స్థానిక చౌడేశ్వరి అమ్మవారికి శుక్రవారం ఆషాఢ మాస పుట్టింటి చీరసారెను సమర్పించారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు పి.అనిల్‌కుమార్‌శర్మ నేతృత్వంలో అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం పెద్దశెట్టి పల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రాములవారి ఆలయం వద్ద నుంచి మేళతాళాలతో ఆషాఢ మాస పుట్టింటి చీరసారెను భక్తులతో కలిసి తీసుకువచ్చి అమ్మ వారికి సమర్పించారు.

‘స్వచ్ఛ’ అవార్డు రావడం  అభినందనీయం 1
1/1

‘స్వచ్ఛ’ అవార్డు రావడం అభినందనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement