
ఇవిగో నిదర్శనాలు...
● మార్చి నెలలో బీఈడీ మొదటి సెమిస్టర్ పేపర్ –2 ప్రశ్నపత్రం లీకేజీ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చింది. మంత్రి జోక్యం చేసుకున్నా వర్సిటీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
● మహిళా వసతి గృహ విద్యార్థులు తమకు భోజనం, సౌకర్యాల కోసం అర్ధరాత్రి చేసిన ఆందోళన వర్సిటీ స్థాయిని ప్రశ్నార్థకంగా మార్చింది.
● పాముకాటుతో క్యాంపస్‌లో విదేశీ విద్యార్థి దుర్మరణం చెందాడు.
● క్యాంపస్‌లో ఒక ఆచార్యుడు ఉద్దేశపూర్వకంగా తనను కారుతో ఢీకొట్టారని ఒక పరిశోధక విద్యార్థిని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
● 2024, 2025 సంవత్సరాల్లో ఇన్‌చార్జి పాలనలో దూర విద్య పరీక్షల్లో రూ.కోట్లు చేతులు మారాయని, వర్సిటీ పరిశీలకులకు దేహశుద్ధి జరిగినా ఉన్నతాధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరించారు.
● న్యాయ విభాగంలో గత ఏడాదిలో విద్యార్థులు అనేక సార్లు ఆందోళనలు చేశారు. ఆర్కిటెక్చర్ కోర్సు గాడి తప్పింది.