
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరణ
నెహ్రూనగర్: సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 2024–25 పోటీల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఆనందంగా ఉందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరాం, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రలు అవార్డును స్వీకరించారు. 23 నగరాలను సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలుగా కేంద్రం ప్రకటించిందని చెప్పారు. వాటిలో గుంటూరు నిలవడం గర్వకారణం అని అన్నారు.
సీఎస్‌సీ సేవల్లో గుర్తింపు
యడ్లపాడు: మండలంలోని బోయపాలెంలో గల శ్రీ సాయిగణేష్ సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్)కు సేవల్లో దేశవ్యాప్తంగా రెండో స్థానం లభించింది. 16వ సీఎస్‌సీ దివస్ వేడుకలు ఢిల్లీలోని యశ్‌భూమి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిగణేష్ కేంద్రం నిర్వాహకులు, వంకాయలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు అవార్డును సీఎస్‌సీ సీఈవో సంజయ్‌కుమార్, రాకేష్ నుంచి అందుకున్నారు. పలువురు అభినందనలు తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరణ