
ఉత్తమ ప్రదర్శనగా ‘ఐ యేట్ ఇండియా’
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ వారు ప్రదర్శించిన ‘ఐ యేట్ ఇండియా’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. మరో నాలుగు బహుమతులను అందుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం (డాక్టర్ ఎం.ఎస్.చౌదరి), ఉత్తమ ఆహార్యం (దినేష్), ఉత్తమ రంగాలంకరణ (దివాకర ఫణీంద్ర), జ్యూరీ బహుమతి (లోహిత్) సహా మొత్తం ఐదు బహుమతులు లభించాయి.
● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, విశాఖపట్నం వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటిక ఉత్తమ నటి (శోభారాణి), ఉత్తమ క్యారెక్టర్ నటి (నాగరాణి), బహుమతులను అందుకుంది. తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటిక దక్కించుకుంది. ఇదే నాటికకు ఉత్తమ రచన (పీటీ మాధవ్), ఈ నాటికలో నటించిన పి.వరప్రసాద్ ఉత్తమ నటుడు బహుమతిని, డి.హేమ ఉత్తమ ప్రతినాయకురాలు బహమతులను గెలుచుకున్నారు.
● ఇతర ప్రదర్శనల్లో ‘అ సత్యం’ నాటికకు ఉత్తమ సంగీతం (పి.లీలామోహన్), ఆ నాటికలో నటించిన పి.రామారావుకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతి లభించాయి. ‘వీడేం మగాడండీ బాబూ’ నాటికలో నటించిన జీఎస్ చలపతికి ఉత్తమ హాస్యనటుడు బహుమతి లభించాయి. ‘అనుకున్నదొకటి అయినదొకటి’నాటికలో పిల్ల బిచ్చగాడు పాత్రధారి రుత్విక్‌కు జ్యూరీ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేతలుగా చెరుకుమల్లి సింగారావు, వి.హైమావతి, గోపరాజు విజయ్ వ్యవహరించారు. పోటీల అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజేతలకు బహుమతులను అందజేశారు. సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, డీఎల్ కాంతారావు పాల్గొన్నారు. తొలుత పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలతో చివరిరోజు కార్యక్రమాలను ఆరంభించారు. తెలుగు కళాసమితి, విశాఖపట్నంవారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు చలసాని కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. చివరగా చైతన్య కళాభారతి, కరీంనగర్‌వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. పి.వెంకటేశ్వరరావు మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరించగా, మంచాల రమేష్ దర్శకత్వం వహించారు. నిర్వాహక సంస్థల బాధ్యులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు