
సక్రంగా మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశం
గుంటూరు వెస్ట్: ఈనెల 10న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జరుగనున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0 నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరగాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాతో కలిసి నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంపై గ్రామ, మండల, పట్టణాల్లో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రచార అంశాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. స్కూల్ మేనేజ్‌మెంట్ సభ్యులు, పూర్వ విద్యార్థులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్దలను ఆహ్వానించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశం జరిగే రోజు ఏర్పాటు చేయనున్న భోజనానికి సరుకులు ముందే సిద్ధపరుచుకోవాలని పేర్కొన్నారు.
●జేసీ భార్గవ్‌తేజ మాట్లాడుతూ హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలుకు సంబంధించి రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కొనుగోలుకు సంబంధించి నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులకు వ్యవసాయ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. కౌలు రైతులు పీసీఆర్డీ కార్డులు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు అందించాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ టి.వి.రేణుక పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి