
చదరంగం ఏకాగ్రతను పెంచింది
నా తండ్రి చెస్ కోచ్. ఆయనతోనే ఉండడం వలన చెస్‌పై ఆసక్తి పెరిగింది. చెస్‌లో ప్రతి రోజూ నేర్చుకునేందుకు ఎంతో ఉంటుంది. దీంతో ఏకాగ్రత పెరిగింది. అది నా చదువుకు ఉపయోగపడింది. ఇటీవలే ఐఐటీలో ఎంటెక్ సీటు వచ్చింది. నాకు ప్రస్తుతం 1589 ఫిడే రేటింగ్ ఉంది. అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ టోర్నమెంట్‌లో 5వ స్థానం సాధించడంతోపాటు పలు జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాను. చదువుతోపాటు ఫిడే రేటింగ్ పెంచుకోవడమే లక్ష్యం. గ్రాండ్ మాస్టర్ హోదా కోసం కృషి చేస్తాను.
– చల్లా చైతన్య రాజు, గుంటూరు