
కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా ముందుకు వెళ్లాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ● ప్రత్తిపాడులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ ● ‘రీ కాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో’ పోస్టర్ల ఆవిష్కరణ
ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు. రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) పోస్టర్లును ఆవిష్కరించారు.
చంద్రబాబు మోసం అందరికీ తెలిసింది
అంబటి రాంబాబు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టారని, వైఎస్ జగన్ కన్నా ఎక్కువ సంక్షమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లు వేశారన్నారు. కానీ అధికారంలోనికి వచ్చిన తరువాత సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకు వెళ్లాలన్నారు.
ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లాలి..
ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ను ప్రతి ఇక్కరికీ గుర్తు చేసేందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెట్టు వెంకటప్పారెడ్డి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ మాజీ ప్రెసిడెంట్ పురుషోత్తం, జిల్లా అధికార ప్రతినిధి నాదెండ్ల రామచంద్రయ్య, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి సాంబశివరావు, యువజన విభాగం నాయకుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు మన్నవ వీరనారాయణ, ఖాశింపీరా, చల్లా హనుమంత్‌యాదవ్, ఆయా అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేసే ఏకై క వ్యక్తి
చంద్రబాబు
రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టులు చేసి జైళ్లకు పంపుతున్నారన్నారు. మొన్న రైతులను పరమర్శించేందుకు గుంటూరు మిర్చియార్డుకు వచ్చిన సందర్భంలో, పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఈ రోజు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు న్యాయం చేయమని వెళుతున్న క్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సృష్టిస్తున్న అవరోధాలు, అడ్డంకులు, నిర్భంధాలు చూస్తుంటే ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ పాలన గుర్తుకువస్తుందన్నారు.
మాజీ ఎంపీ, పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలిచాడని, కానీ ప్రజలు ఓడిపోయారన్నారు. గెలిపించిన ప్రజలనే మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచంలోనే ఏకై క వ్యక్తి చంద్రబాబన్నారు. ఓడిపోయిన తరువాతనే మాజీ సీఎం వైఎస్ జగన్ విలువ జనానికి తెలుస్తుందన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్న విషయాన్ని ప్రజలు, మహిళల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఊర్లల్లో తిరిగే ప్రసక్తి ఉండదన్నారు.