
పికిల్ బాల్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని వీవీవీ హెల్త్ క్లబ్‌లో ఎన్నుకున్నారు. ఎన్నికలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి పి.నరసింహారెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఒలింపిక్ సంఘం నుంచి కె.వేణుగోపాల్‌తోపాటు న్యాయవాది చిగురుపాటి రవీంద్రనాధ్ హాజరయ్యారు. చీఫ్ ఇన్ ప్యాట్రన్‌గా టి.అరుణ్ కుమార్, చైర్మన్‌గా చుక్కపల్లి రాకేష్, గౌరవాధ్యక్షుడిగా టి.హరికిషన్ సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎం.శివకుమార్, ఉపాధ్యక్షులుగా సి.హెచ్.రవీంద్ర బాబు, ఎన్‌వీ కమలాకాంత్, ఎస్‌వీ రామ కోటేశ్వరరావు, డాక్టర్ పి.వరుణ్, డాక్టర్ టి.హనుమంతరావు, ఎం.భరత్ కుమార్, కార్యదర్శిగా జీవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఎం.కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఫణీంద్ర, ఎన్ ఫణిరామ్, ఎస్‌కే మన్సూర్ వలి, ఎ.సుబ్బారావు, నిర్వహణ కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా కె.సుస్మితా చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.