
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్‌పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్‌పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్‌కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్‌లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారిని కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.