
గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితులు అరెస్టు
నెహ్రూనగర్: అడవి తక్కెళ్లపాడు టిడ్కో గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు 2 ఎకై ్సజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ ఎం యశోధర దేవి తెలిపిన వివరాల మేరకు.. అడవి తక్కెళ్లపాడుకు వెళ్లే రోడ్డులో చెరువు కట్ట వద్ద ఆటో నిలిపి గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న గుంటూరు వారితోటకు చెందిన షేక్ జాఫర్ అహ్మద్, కాకుమానువారితోటకు చెందిన పెట్లూరి సాహిద్, బొంగరాలబీడుకు చెందిన దాసరి సుమంత్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 456 గ్రాముల గంజాయిని, ఒక ఆటో. 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నగరానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి వద్ద నుంచి వీరు గంజాయి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సీహెచ్ మాధవి, పీఆర్‌కె మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
వినియోగిస్తున్న వ్యక్తులకు కౌన్సెలింగ్
నగర శివారు ప్రాంతాల్లో గంజాయి వినియోగిస్తున్న వ్యక్తులను గుంటూరు 2 ఎకై ్సజ్ స్టేషన్‌కు అధికారులు పిలిపించారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి మరీ సీఐ యశోధరదేవి కౌన్సెలింగ్ నిర్వహించారు. గంజాయి వినియోగించినా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.