
శాకంబరిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: శివాలయంలో భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం వద్ద ఆకుకూరలు, కూరగాయల తోరణాలతో అలంకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షణలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. విఘ్నేశ్వరుణ్ణి, నందీశ్వరుడిని, ప్రసన్నాంజనేయస్వామిని, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని కూడా అలంకరించారు. ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దంపతులు ఆషాఢ సారె సమర్పించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక గ్రామ పెద్దలు, భక్తులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

శాకంబరిగా భ్రమరాంబ అమ్మవారు