‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన

Jul 21 2025 5:55 AM | Updated on Jul 21 2025 5:55 AM

‘స్వచ

‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన

నెహ్రూనగర్‌: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థ ‘సూపర్‌ స్వచ్ఛ్‌ లీగ్‌ సిటీస్‌ అవార్డు’ పొందింది. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అభినందించారు. తిరుపతిలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సురేష్‌ కుమార్‌లతో కలిసి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని నగరపాలక సంస్థ అధికారులకు అందజేశారు. కార్యక్రమానికి కమిషనర్‌ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ ఇన్‌చార్జి ఎంహెచ్‌ఓ జె.రామారావు, ప్రజారోగ్య విభాగ కార్మికులు హాజరయ్యారు.

మల్లిక స్పయిన్‌ సెంటర్‌కు అవార్డు

గుంటూరు మెడికల్‌: గుంటూరులోని మల్లిక స్పయిన్‌ సెంటర్‌ పరిశోధనా బృందానికి సొసైటీ ఫర్‌ మినిమల్లీ ఇన్‌వేసీవ్‌ స్పయిన్‌ సర్జరీ అండ్‌ ఆసియా పసిఫిక్‌ (స్మిస్‌ అండ్‌ ఆసియా పసిఫిక్‌ సొసైటీ) వార్షిక సదస్సులో ప్రదర్శించిన పరిశోధనకు ‘బెస్ట్‌ పేపర్‌ అవార్డు’ దేశంలోనే తొలిసారి లభించింది. సెంటర్‌ అధినేత, సీనియర్‌ స్పయిన్‌ సర్జన్‌ డాక్టర్‌ జె. నరేష్‌ బాబు నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది. ఆల్ట్రాసోనిక్‌ టెక్నాలజీని ఎండోస్కోపిక్‌ స్పయిన్‌ సర్జరీకి అన్వయించి అతి సమర్థంగా చేసే తీరుపై పరిశోధన చేశారు. ఆదివారం సెంటర్‌లో డాక్టర్‌ నరేష్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ... అవార్డుతోపాటు బృందంలోని సభ్యుడైన డాక్టర్‌ పృథ్వీరెడ్డికి ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రముఖ సర్జరీ కేంద్రాలను సందర్శించే ట్రావెల్‌ ఫెలోషిప్‌ కూడా లభించినట్లు తెలిపారు. అవార్డును వచ్చే సంవత్సరం సింగపూర్‌లో అందిస్తారని పేర్కొన్నారు. గతేడాది థామస్‌ వైట్‌ క్లౌడ్‌ అవార్డును, ఇండియన్‌ స్పయిన్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ వారి బెస్ట్‌ స్పయిన్‌ క్లినికల్‌ రీసెర్చి జాతీయ అవార్డును కూడా డాక్టర్‌ నరేష్‌బాబు స్వీకరించారు.

రైలు ఢీకొని యువకుడు మృతి

వినుకొండ: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం వినుకొండలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. వినుకొండ పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాల వైపు వెళ్లు రహదారిలో జక్కంపూడి రామారావు (27) అనే యువకుడు పట్టాలు దాటుతుండగా అటుగా వైపు వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన  1
1/1

‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement