
అర్జీల పరిష్కారం మరింత వేగవంతం
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సులభంగా పరిష్కరించగలిగే వాటి కోసం అర్జీదారులను పదే పదే తిప్పుకోవద్దన్నారు. అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. 259 అర్జీలను కలెక్టర్‌తోపాటు జేసీ ఎ.భార్గవ్ తేజ, డీఆర్‌ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.