
నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం
తెనాలి అర్బన్: విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తుందని జిల్లా అదనపు స్కిల్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్ వీసీహెచ్. ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంచుకుని, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేళాలో 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. మేళాలో 279మంది రిజిస్టర్ చేయించుకున్నారని, వారిలో 112 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపిౖకైనట్లు చెప్పారు. ఎంపికై న వారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కె.శ్యామ్‌సుందర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం.రామారావు, కె.కమలకుమారి, జెఏఏ ఎ.శ్రీదేవి, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి పి.ఈశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా అదనపు స్కిల్ డెవలెప్‌మెంట్
ఆఫీసర్ ప్రసన్నకుమార్