● ‘కలం’ ఎత్తిన సాక్షి ఉద్యోగులు
జిల్లావ్యాప్తంగా సాక్షి కార్యాలయాలు, యూనిట్ ఆఫీస్‌లపై దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మంగళగిరిలోని సాక్షి కార్యాలయం ఉద్యోగులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నేతల దురాగతాన్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యాన్ని ఖండిస్తూ సాక్షి ప్రతినిధులు గుంటూరులోని స్పెషల్ బ్రాంచ్ సీఐ అలహరి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షి దినపత్రిక, టీవీ కార్యాలయాలపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలని కోరారు.
– లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)


