క్రీస్తు చూపిన బాటలో నడవాలి
ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే యోషేన్ రాజు ఘనంగా ‘తెనాలి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు’
కొల్లిపర: ఏసు క్రీస్తు బోధనలను ఆచరించి, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషేన్ రాజు అన్నారు. తెనాలి నియోజవర్గ వైఎస్సార్ క్రాంగెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో కొల్లిపర గ్రామం మాయబజార్ సెంటర్‌లో తెనాలి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు పార్టీ ముఖ్య నేతలు నడుమ గ్రామ పార్టీ నాయకులు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులుగా తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యవహించారు. ముఖ్యఅతిథిగా కొయ్యే యోషేన్ రాజు మాట్లాడుతూ ఏసు జన్మదినం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టిన రోజున ఈ ప్రాంత ప్రజలు రెండూ కలిపి ఒకే రోజు జరుపుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఏసుప్రభువు దేవుడై ఉండి.. ప్రజలందరి రక్షణ నిమిత్తం ఈ లోకానికి వచ్చారన్నారు. మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, కరుణ అనే సూత్రాలను క్రైస్తవులు పాటించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఏసు జన్మించడం చరిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాలన్నారు. అనంతరం ముఖ్యఅతిథులతో చర్చి పాస్టర్లు, గ్రామ పార్టీ నాయకులు కలిసి సెమీ క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. వందలాది మంది క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యఅతిథులను ఉన్నవ నాని కుటుంబసభ్యులు, ఇతరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం అనంతరం 100 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు, 150 మంది పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెద్దటి సురేంద్ర, తెనాలి పురపాలక సంఘం చైర్మన్ తాడిబోయిన రాధికా రమేష్ , వైఎస్సార్‌సీపీ తెనాలి రూరల్ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కళ్ళం వెంటప్పారెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, ఉపసర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, ఎండ్రపాటి స్టాలిన్, ఉన్నవ నాని, కనపర్తి రంగరావు, అక్కిదాస్ కిరణ్, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, బడుగు కాటయ్య, నాల్లాడి బుజ్జిబాబు, ఎంపీటీసీ ఝూన్సీ, పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అవుతు సాంబిరెడ్డి, వంగా సుజాత, మర్రెడ్డి బ్రహ్మరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, మోర్ల శ్రీను, భీమవరపు సంజీవరెడ్డి, బొల్లిముంత పోతురాజు, కళ్ళం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


