ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
కేక్ కటింగ్, స్వీట్స్ పంచుకున్న ప్రజలు, నేతలు, కార్యకర్తలు భారీగా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున అన్నదానం చేసిన అభిమానులు జగనన్న సుపరిపాలన గుర్తుచేసిన నియోజకవర్గ సమన్వయకర్తలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంబరాలు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గుంటూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమాలు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా 53 కిలోల కేక్‌ను కట్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 240 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్‌తోపాటు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అనేక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో అంబటి రాంబాబు, నేతలు పాల్గొన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని డివిజన్‌లలో కేక్ కటింగ్ నిర్వహించారు. పార్టీ కార్యకర్త గౌస్ ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఒక మహిళకు తోపుడు బండిని అందించారు. కార్యకర్త కుటుంబానికి కుట్టుమిషన్ అందజేశారు. తూర్పు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. నూరి ఫాతిమాతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెనాలి నియోజకవర్గంలో..
తెనాలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధికలు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ చేశారు. పట్టణంలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు 70 మంది రక్తదానం చేశారు. 500 మందికి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. తెనాలి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకల కేక్‌ను కట్ చేశారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో...
ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్తిపాడులోని వైఎస్సార్ కాంస్య విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బలసాని కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బలసాని ప్రారంభించారు. పెదనందిపాడు మండలంలోని వరగాని, జీజీపాలెం, నందిపాడు గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వస్త్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట నియోజకవర్గ పరిశీలకులు షేక్ గులాం రసూల్ తదితరులున్నారు.
తాడికొండ నియోజకవర్గంలో..
తాడికొండ నియోజకవర్గ సమన్వయర్త వనమా బాలవజ్రబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాడికొండ అడ్డరోడ్డులో భారీ రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. పార్టీ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ హాజరయ్యారు. 180 మంది రక్తదానం చేయగా, వెయ్యి మందికి అన్నదానం చేశారు. లాం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని మండలాల్లో అన్నదానాలు జరిగాయి. లాం, పొన్నెకల్లులో భారీ స్థాయి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్ళూరులో అన్నదానం, కేక్ కటింగ్ జరిగాయి.
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు
ఘనంగా జననేత జన్మదిన వేడుకలు


