తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్‌హామ్ కెనాల్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్, షంషుద్దీన్‌ల పెద్ద కుమారుడు గఫూర్ (25) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్‌హామ్ కెనాల్ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యూ ఇయర్‌ని పరిష్కరించుకుని అమిగోస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన మంగళగిరి సమీపంలోని హాయ్ ల్యాండ్‌లో మ్యూజికల్ నైట్ జరగనుందని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. మ్యూజికల్ నైట్‌లో మాస్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌లో విజయవాడ గుంటూరు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. విజయవాడ నగరంలోని ఓ హోటల్‌లో న్యూ ఇయర్ వేడుకల పోస్టర్‌ను రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మ్యూజికల్ నైట్‌లో తనతోపాటు మరో 30 మంది సింగర్లు పాల్గొంటారని తెలిపారు. ఆరు వేల మంది పాల్గొనవచ్చని, టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తిరుపతమ్మ ఆలయానికి విరాళం


