అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
పెదకాకాని: అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆదివారం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జీవీఆర్ ప్రైమ్ హోటల్‌లో ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడుగురు మహిళలు, 9 మంది పురుషులు (విటులు), ఒక మేనేజర్, ఒక ఆర్గనైజర్ మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11 సెల్ ఫోనన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునేందుకు పెదకాకాని పోలీసుస్టేషన్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, పేకాట, వ్యభిచారం, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీలు వంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంహించేది లేదన్నారు. అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారు, నిర్వహించే వారు, వాటికి సహకరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


