పోలియో చుక్కలతో నిండు జీవితం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు మెడికల్: రెండు పోలియో చుక్కల ద్వారా చిన్నారులకు నిండు జీవితాన్ని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం స్థానిక శ్రీనివాసతోట అర్బన్ పీహెచ్‌సీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారన్నారు. మొత్తం 4,406 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ బాబు తదితరులు పాల్గొన్నారు.


