సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపిస్తా !
నా స్వస్థలం కొల్లూరు మండలం పోతార్లంక. తల్లిదండ్రులు మురళీకృష్ణ, కాశీ అన్నపూర్ణలు. నాన్న అర్చకత్వం చేస్తారు. అమ్మ గృహిణి. ఇంటర్ ఫలితాల్లో 992 మార్కులు సాధించా. బీటెక్‌లో సీఎస్‌ఈలో సైబర్ సెక్యూరిటీ తీసుకుంటాను. జేఈఈ మెయిన్స్‌లో 93.4 పర్సంటెల్స్ సాధించగా ఈఏపీసెట్‌లో 5వేలలోపు ర్యాంక్ తెచ్చుకోవటానికి కృషి చేస్తున్నా. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం నా లక్ష్యం. – వి. కౌశిక్,
విజ్ఞాన్ జూనియర్ కళాశాల, వడ్లమూడి


