సాక్షి డైరెక్టర్‌ పీవీకే ప్రసాద్‌కు పితృవియోగం | - | Sakshi
Sakshi News home page

సాక్షి డైరెక్టర్‌ పీవీకే ప్రసాద్‌కు పితృవియోగం

Aug 5 2023 1:30 AM | Updated on Aug 5 2023 11:18 AM

- - Sakshi

మంగళగిరి: సాక్షి దినపత్రిక డైరెక్టర్‌ పీవీకే ప్రసాద్‌ తండ్రి పాలడుగు మాధవరావు(92) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొండపనేని టౌన్‌షిప్‌లోగల కుమారుని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం కృష్ణాజిల్లా ముస్తాబాద.

పశ్చిమగోదావరి జిల్లా కో–ఆపరేటివ్‌ బ్యాంకులో కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాధవరావు భార్య హైమావతి 2019లో కాలం చేశారు. ఆయనకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శనివారం మంగళగిరిలో పాలడుగు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement