వార ఫలాలు (సెప్టెంబర్‌ 13  నుంచి 19 వరకు)

Weekly Horoscope From September 13th To 19th 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో కొంత ఊరట. పారిశ్రామికవర్గాల యత్నాలలో కదలికలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం ఎదురైన సమస్యలు క్రమేపీ తీరతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటాయి. పాతబాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించదు. ప్రయాణాలలో అవాంతరాలు. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. కుటుంబసభ్యులు మీ అభిప్రాయాలతో విభేదిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ఇంటి నిర్మాణాల్లో కొంత జాప్యం తప్పదు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడులు. కళారంగం వారికి అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి›స్తోతాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక మార్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఏ పని చేపట్టినా పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు పోటీదారుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కొంత అనుకూలమనే చెప్పాలి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతనోత్సాహంతో పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు మరింత అనుకూలిస్తాయి.  కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహన, గృహయోగాలు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన రీతిలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో మీమాటకు ఎదురుండదు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కృషి, పట్టుదలతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. నృసింహ     స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థికSవ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు వేగం తగ్గినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. సంతోషకరమైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాల బాట పడతారు. ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు  పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలపై చర్చిస్తారు. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక పరిస్థితి చక్కబడి ఊరట చెందుతారు. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సహచరుల సహాయం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఈతిబాధలు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
శ్రమ కొంతమేర ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధన లేదా ఆస్తిలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తులవుతారు. కళారంగం వారి యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబి, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top