లక్ష్మీ పూజ చేయనున్న కేజ్రీవాల్‌ కేబినేట్‌

Delhi CM Arvind Kejriwal To Perform Diwali Pujan At Akshardham Temple - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి పండుగ చెడు పై మంచి గెలుపుకు ప్రతీక .ఈ దీపాల వెలుగులో అమవాస్య చీకట్లను పారద్రోలాలని ప్రజలందరూ లక్ష్మి పూజ చేస్తారు. గత మార్చి నుంచి దేశంలో ప్రజలందరి జీవితాలలో కరోనా వలన అమవాస్య చీకట్లు అలుముకున్నాయి. మరి ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. ఈ తరుణంలో కరోనా చీకట్లు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన  సహచర కేబినేట్‌ మంత్రులతో కలిసి అక్షరధామ్‌ దేవాలయంలో శనివారం రాత్రి 7.39లకు లక్ష్మీ పూజ చేయనున్నారు. అంతేకాకుండా ప్రజలందరూ స్టే ట్యూన్‌డ్‌ కేజ్రీ టీవి అంటూ లైవ్‌లో పూజా  కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్‌ స్వయంగా ట్విటర్‌లో తెలుపుతూ...2 కోట్ల ఢిల్లీ ప్రజలు అందరం కలిసి లక్ష్మి పూజ చేసి మన జీవితాలలోని కష్టాలను పారద్రోలుదామని  పిలుపునిచ్చారు. (చదవండి: ‘కోరల’తో వస్తోన్న ‘కాలుష్య–కమిషన్‌’)

గత కొ​న్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నివారణ చర్యలలో భాగంగా ప్రజలందరూ క్రాకర్స్‌, బాణసంచా కాల్చకుండా ఈ పూజలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో నవంబర్‌30 వరకు  ఎలాంటి క్రాకర్స్‌, బాణసంచా కాల్చకుండా నిషేధం విధించారు. క్షేత్ర స్థాయిలో నిషేధాజ‍్క్షలు అమలుకు ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ప్లైయింగ్‌ స్కాడ్‌ని నియమించారు. ఢిల్లీ ప్రభుత్వం పెరుగుతున్న కేసులు వారం పది రోజుల్లో కంట్రోల్‌లోకి  వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తుంది(చదవండి: ఢిల్లీలో గరిష్ఠ స్థాయికి కరోనా కేసులు) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top