ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే.. వయసెంతంటే! | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే.. ఆరోగ్య రహస్యమిదే..!

Published Wed, Apr 10 2024 1:03 PM

Worlds Oldest Human Born In 1900 Peru Claims With 124 Year Old - Sakshi

ఇంతవరకు ప్రపంచంలో అత్యంత వృద్ధుల జాబితాను చూశాం. ఇటివల  సుదీర్థకాలం జీవించి ఉన్న వృద్ధులను ఓ ఐదుగురి గురించి తెలుసుకున్నాం. వారిలో కొందరూ గిన్నిస్‌ రికార్డులకెక్కారు కూడా. వాళ్లందర్నీ కాలదన్నేలా ఎక్కువ కాలం జీవించిన మరో వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఇంతవరకు గిన్నిస్‌ రికార్డులో పేరు నమోదు చేసుక్ను ఆ వృద్ధుల కంటే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి అతడే. మంచి ఆరోగ్యంతో జీవించి ఉన్న వృద్ధుడు. అతడు పుట్టింది ఎప్పుడో వింటే ఆశ్చర్యపోతారు. అన్ని దశాబ్దాలు ఎలా జీవించాడా? అనిపిస్తుంది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే..

హువానుకోలోని సెంగ్రల్‌ పెరువియన్‌ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్‌. అతడి వయసు 124 ఏళ్లు అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సుదీర్ఘకాలం జీవించిన వృద్ధుడిగా ధృవీకరించింది. అత్యంత పురాతనమైన వ్యక్తి కూడా అని తెలిపింది. అన్నేళ్లు అబాద్‌ జీవించడానికి అతడి అనుసరించిన జీవనశైలేనని చెబుతోంది అక్కడి ప్రభుత్వం. ప్రశాంతతకు పెద్ద పీఠ వేస్తూ ఆనందంగా ఉండటమే గాక అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతాడని మెచ్చుకుంది. ఈ ఏప్రిల్‌ 5న తన 124వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు.

అంతేగాదు పెరువియన్‌ అధికారులు అతడే అత్యంత వృద్ధ వ్యక్తి అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు దరఖాస్తుల చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పత్రాలను కూడా సమర్పించినట్లు తెలిపారు. తప్పకుండా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఈ దరఖాస్తులను స్వీకరిస్తుందని ధీమాగా చెప్పారు అధికారులు.  అయితే అక్కడ ప్రభుత్వం ఈ విషయాన్ని 2019లో గుర్తించింది. ప్రభత్వ పెన్షన్‌ పొందుతూ వృద్ధాశ్రమంలో ఉండటంతో అతని ఐడీతో సహా ఈ విషయాన్ని అదికారులు గుర్తించి వెల్లడించటం జరిగింది. 

అతడి ఆరోగ్య రహస్యం ఏంటంటే..
అబాద్‌ తన డైట్‌లో మంచి పండ్లు ఉండేలా చూసుకుంటాడు. అలాగే గొర్రె మాంసం ఇష్టంగా తింటాడట. పెరువియన్‌ సంప్రదాయం ప్రకారం తినే కోకా ఆకులను ప్రతిరోజు నమలడం అలవాటు చేసుకున్నానని. బహుశా ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి అది కూడా ఒక కారణమని అబాద్‌ చెప్పారు. 

అంత క్రితం గిన్నిస్‌ రికార్డులకెక్కిన వారి వయసు..
ఇంతకు మునుపు గిన్నిస్‌ రికార్డులకెక్కిన వారి వయసు పరిశీలిస్తే..114 ఏళ్ల జీవించిన వెనిజులా వ్యక్తి మరణాంతరం గిన్నిస్‌ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం జీవించి గిన్నిస్‌ రికార్డులకెక్కిన వృద్ధుడి వయసు 111 ఏళ్లు. అతనితోపాటు ఇప్పటి వరకు జీవించి ఉన్న వృద్ధ మహిళ వయసు కేవలం 117 ఏళ్లు మాత్రమే. అయితే ఇప్పుడు పెరుకి చెందిన అబాద్‌ అనే వృద్ధుడే వాళ్లందర్నీ వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గిన్నిస్‌ రికార్డులకెక్కడం ఖాయం కదూ..!

(చదవండి: ఈ పువ్వులతో మధుమేహానికి చెక్‌ ! ఎలాగంటే..?)

Advertisement
Advertisement