అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!? | Who Invented Exams? Know The History | Sakshi
Sakshi News home page

Exams: అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!? మొట్టమొదటగా అక్కడే అమలు..

Apr 12 2026 10:38 AM | Updated on Apr 12 2026 10:52 AM

Who Invented Exams? Know The History

ఇది పరీక్షల కాలం. పిల్లలతోపాటు పెద్దలూ హడావిడి పడుతుంటారు. అసలీ పరీక్షలు ఎవరు కనిపెట్టారంటూ కొందరు పిల్లలు విసుక్కుంటుంటారు. లిఖిత పూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం ఏదో తెలుసా? చైనా. అవును! ప్రామాణికతో కూడిన లిఖిత పరీక్షలను మొదట చైనాలో అమలు చేశారు. వీటిని ‘కేజు’ అని పిలిచేవారు. 

సుయి రాజవంశం  క్రీ.శ. 605లో ఉద్భవించింది. దాని వారసురాలైన టాంగ్‌ రాజవంశం, వు జెటియాన్‌ పాలనలో పరీక్షా విధానం మొదలైంది. సాంగ్‌ రాజవంశం కాలంలో కేవలం గొప్ప ఇళ్ల వాళ్లే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారులు అయ్యేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించేవారు. కన్‌ఫ్యూషియస్‌ క్లాసిక్స్‌ను సిలబస్‌గా చదువుకుని పరీక్షలకు కూచునేవారు. 

అలా పాసైన వారికి ఉద్యోగాలు దక్కేవి.  13వ శతాబ్దంలో మంగోల్‌ యువాన్‌ రాజవంశం ప్రారంభంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత మంగోలులకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండే ప్రాతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు.  కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్నీ దేశాలలోకి వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement