ఎంతో ఇష్టంగా తాగే చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా! | When Do You Add Milk To Tea Did Not Originate From India | Sakshi
Sakshi News home page

ఎంతో ఇష్టంగా తాగే చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా! దీని వెనక పెద్ద స్టోరీనే ఉంది!

Sep 21 2023 5:28 PM | Updated on Sep 21 2023 6:39 PM

When Do You Add Milk To Tea Did Not Originate From India  - Sakshi

ఓ కప్పు 'టీ' తాగితే హమ్యయ్య అనిపిస్తుంది. అంతెందుకు పనివాళ్ల దగ్గర నుంచి ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అబ్బా ఓ కప్పు 'టీ' పడితే ప్రాణం సుఖంగా ఉంటుంది. హుషారుగా పనిచెయ్యొచ్చు అనుకుంటారు. చాలామంది టీ తాగితే చాలు ఆకలి తీరిపోయిందనుకుంటారు. అంతలా చాయ్‌కి అతక్కుపోయారు కొందరూ. అలాంటి టీలో ఒకప్పుడూ పాలు కలిపేవారే కాదట. మధ్యలోంచే మొదలైంది. అక్కడనుంచి టీని పాలు కలిపి తయారు చేయడం ప్రారంభించారట. అంతేగాని ముందుగా ఓన్లీ డికాషన్‌ తప్ప పాలు కలపేవారే కాదట. అసలెప్పుడూ అలా చేయడం ప్రారంభమైంది? ఎలా వచ్చింది? తదితరాలు గురించే ఈ కథనం.

మన దేశంలో ఎవరైన వస్తే ముందుగా టీ తాగుతారా అని అడుగుతారు. ఇంట్లో ఏం లేకపోయిని జస్ట్‌ ఓ టీ కప్పు, కొన్ని బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చాయ్‌లో పాలు కలపడం అనే ప్రక్రియ భారత్‌ నుంచి ప్రారంభం కాలేదట. మన వరకు వచ్చేటప్పటికీ.. బ్రిటీస్‌ వాళ్లు టీ తోటలు పెంచేంత వరకు మనకు చాయ్‌ గురించి తెలియనే తెలియదు. బ్రిటీష్‌ వాళ్లకు కూడా టీ గురించి 17వ శతాబ్దం వరకు తెలియదట. టిబెట్‌లో ప్రజలు టీ పొడితో పాలు కలిపి తయారు చేసేవారట. అలా చైనా నుంచి మంగోలియాకు టీ తయారీ విధానం విస్తరించిందట. ఇక 1800 మధ్య కాలం నుంచి బ్రిటీష్‌వారు టీ పొలాలు ఏర్పాలు చేసి దుకాణాలు పెట్టి విక్రయించేంతవరకు టీ పెట్టే అలవాటు మనకు లేనేలేదట. కాబట్టి మనకు టీలో పాలు కలపడం గురించి బ్రిటీష్‌ వాళ్లు అలవాటు చేసిందే గానీ ముందుగా భారత్‌లో మాత్రం లేదు. 

టీలో పాలు కలపడం వెనుక కారణం..
పశ్చిమ ఐరోపాలో పర్యటించేటప్పుడూ సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు ఉండేవి. ఆ టైంలో కాస్త నకీల టీల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో టీని ఆసక్తికరంగా రుచిగా ఉండేలా తయారు చేసే విధానాలపై దృష్టి పెట్టారు అప్పటి ప్రజలు. ఆ క్రమంలో పాలు జోడించటం జరిగింది. సాధారణ 'టీ' డికాషన్‌ చేదుగా ఉండటంతో పాలు జోడించి మరింత రుచిగా తాగేలా చేయడమ ప్రారంభించారు. అలానే మరో కారణం కూడా ఉంది. అదేంటంటే..యూరోపియన్‌ పింగాణి పాత్రలు చాలా సున్నితమైనవి, ఖరీదైనవి. దీంతో వేడివేడీ టీ పోయగానే అవి పగలిపోయేవి. కప్పులు పగలకుండా లేదా పగళ్లు రాకుండా ఉండేలా చల్లటి పాలు పోసి ఆ తర్వాత వేడివేడి టీ డికాషిన్‌ పోసేవారట. అలా పాలతో టీ  సర్వ్‌ చేయడం ప్రారంభమైందట. 

పాలతోనే రుచిగా ఉటుందని ఎప్పుడూ తెలిసిందంటే..
టిబెటియన్లు పోషకాహారాన్ని పెంచెందుకు ఈ టీ తయారీకి పాలు జోడించారట. అలాగే బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం సమయంలో శ్రామిక తరగతి ప్రజలు టీలో పాటు జోడించేవారట. వారు దానిని బిల్డర్స్‌ టీ అని పిలిచేవారట. సుదీర్ఘ పనిదినాల్లో టీ విరామంలా దీన్ని సేవించి తిరిగి నూతన ఉత్తేజంతో పనిచేశేవారట. టీలో ఉండే టానిన్లు కారణంగా చేదుగా ఉంటుంది.

పాలుతో కాకుండా నేరుగా తాగితే నోరు పొడిబారినట్లు అవుతుంది. అదే ఇలా పాలతో తీసుకుంటే టానిన్‌ల ప్రభావాన్ని తగ్గించి చక్కటి రుచితో బాటు కాస్త నోరు తేమగా ఉండేలా చేస్తుంది. పాలు ఉపయోగించడంతో తక్షణమే ఒంట్లోకి శక్తి వచ్చి కాస్త బలంగా ఉన్న ఫీలింగ్‌ వస్తుంది. అప్పటి నుంచి ఇలా పాలను టీ పోడితో జోడించి రుచిగా తయారు చేయడం ప్రారంభమైందట.

అలాగే మరో కారణం కూడా చెబుతుంటారు కొందరూ. టీని పాలతో తీసుకునే అలవాటు ఫ్రెంచ్ ఉన్నత వర్గానికి చెందిన వారి నుంచి మొదలైందని కొందరి వాదన. 1685లో, ఫిలిప్ సిల్వెస్ట్రే డుఫోర్ పాలతో దగ్గు, జీర్ణ రుగ్మతలకు విరుగుడుగా ఇలా టీని తయారు చేశాడని అంటారు. కలోనియల్ బోస్టన్‌లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ బ్లాక్ టీలు తప్పనిసరిగా పాలతో బాగా రుచిగా ఉండేవి. వారు కాంటన్ నుంచి లండన్ మీదుగా తమ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసే సమయానికి టీ పాతబడిపోయి రుచిగా ఉండేది కాదు. దీంతో పాలు జోడించగానే రుచిగా ఉండేది. ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక  కెన్యాలో ప్రస్తుతం ఉత్పత్తి చేయబడిన టీలో ఎక్కువ భాగం పాలతో కలిపి తాగడానికి తయారు చేసిన టీనే ఉత్పత్తి చేస్తోంది. 

(చదవండి: పిల్లల్లో టాన్సిల్స్‌ సమస్య ఎందుకు వస్తుంది? నిజానికి ట్రాన్సిల్స్‌ మంచివే ఎందుకంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement