అరె.. ఏం చేస్తున్నావ్‌.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..

Viral Video Bhopal Vegetable Seller Washing Coriander In Drain Water - Sakshi

అటెన్షన్‌... మీ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్రైనేజీ వాటర్‌లో కడిగిన కూరగాయలు మీ వంటింటికి చేరుతున్నాయి. దయచేసి కూరగాయను కొనేముందు ఓ క్షణం ఆలోచించండి.. మరింత అవగాహన పెంచుకోండి.. అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
చూశారంటే యాక్‌..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన ఓ గుర్తుతెలియని కూరగాయల వ్యాపారిపై కేసు ఫైల్‌ అయ్యింది. ఏం చేశాడో తెలెస్తే మీకు స్పృహ తప్పుతుంది. పొద్దుపొద్దునే తాజా కొత్తమీర కట్టల్ని సింథికాలనీ రోడ్డుపై లీకైపారుతున్న డ్రైనేజీ వాటర్‌లో కడిగాడు మరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. డ్రైనేజీ నీళ్లతో కడిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వీడియో తీసిన వ్యక్తి పదేపదే చెబుతున్నా సదరు వ్యాపారి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడట.

చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!

దీంతో జిల్లా కలెక్టర్‌ అవినాష్‌ లవనియా... ఈ కల్తీ, కలుషిత ఆహార సమాచార సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార శాఖ, పౌర అధికారులకు ఆదేశించినట్లు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా భోపాల్‌ జిల్లా ఆహార భద్రత అధికారి దేవేంద్ర కుమార్‌ దుబే ఐపీసీ సెక్షన్‌ 269 కింద సరదు గుర్తుతెలియని వ్యాపారిపై కేసు ఫైల్‌ చేశామని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెల్పారు.

కాబట్టి.. కూరగాయల వ్యాపారుల దగ్గర కూరగాయాలు కొనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించిమరీ కొంటే మంచిది. ఏం తింటున్నామో.. ఎలాంటి ఆహారం కొంటున్నామో.. తెలసుకోకపోతే బతుకు డ్రైనేజి పాలౌతుంది!

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top