సమ్మర్‌ టూర్స్‌లో కార్‌సేఫ్టీకి టిప్స్‌..! | Travel Tips: Tips for Safe Summer Driving and Keeping Your Car Cool | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ టూర్స్‌లో కార్‌సేఫ్టీకి టిప్స్‌..!

May 25 2026 3:37 PM | Updated on May 25 2026 3:36 PM

Travel Tips: Tips for Safe Summer Driving and Keeping Your Car Cool

సమ్మర్‌ హాలిడేస్‌ అంటే రోడ్‌ ట్రిప్స్‌ గుర్తొస్తాయి. హైవేస్, ప్లే లిస్టులు, టీ స్టాప్స్, సన్‌సెట్‌ డ్రైవ్స్‌ ఇవన్నీ ప్రయాణంలో భాగం అవుతాయి. కానీ ఎండాకాలంలో కార్‌ కేర్‌ చేయకపోతే జర్నీ మధ్యలో టైర్‌ పేలిపోవడం లేదా ఇంజిన్‌ వేడెక్కడం లాంటి సమస్యలు కూడా రెడీగా ఉంటాయి. రోడ్‌ ట్రిప్‌ అనే ఒక ఎగ్జైట్మెంట్‌ను బోనెట్‌ నుంచి వచ్చే పొగ తగ్గించే అవకాశం ఉంది.

ఇంజిన్‌ హీట్‌తో జాగ్రత్త
ఎండాకాలంలో లాంగ్‌ డ్రైవ్స్‌ చేస్తున్నప్పుడు ఇంజిన్‌ ఎక్కువ హీట్‌ అవ్వడం సాధారణం. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రత మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ట్రిప్‌ ముందు కూలెంట్‌ లెవల్స్‌ చెక్‌ చేయడం చాలా ఇంపార్టెంట్‌. రేడియేటర్‌ వాటర్‌ సరిగ్గా ఉందా లేదా అని ఒక్కసారి కన్ఫర్మ్‌ చేసుకోవాలి. 

ఇంజిన్‌ ఆయిల్‌ పాతది అయితే వేడి ఎక్కువగా జనరేట్‌ అవుతుంది. అందుకే సర్వీసింగ్‌ను టైమ్‌కు చేయించడం మరవకండి. ట్రాఫిక్‌లో కంటిన్యూగా ఏసీ ఫుల్‌ బ్లాస్ట్‌లో వినియోగిస్తే చేస్తే కూడా ఇంజిన్‌ ప్రెషర్‌ పెరిగి΄ోతుంది. కొంచెం బ్రేక్స్‌ ఇస్తూ లాంగ్‌ డ్రైవ్‌ చేస్తే కార్‌కి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది.

టైర్‌ పేలిపోకుండా ఉండాలి అంటే ..
ఎండాకాలంలో స్పీడుగా వెళ్లడం అనేది కారుకు బల పెట్టడం పరీక్షలాంటిదే. ఎందుకంటే ఈ సమయంలో టైర్‌ ప్రెషర్‌ ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణానికి ముందు పీఎస్‌ఐ లెవల్స్‌ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్‌ చేయాలి. చాలా మంది అదనపు భద్రత కోసం టైర్లలో గాలిని ఎక్కువగా నింపుతారు. కానీ ఎండ వేడి కారణంగా ఆ గాలి విస్తరించి టైర్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

అలాగే పాత టైర్లతో దూర ప్రయాణాలు ప్లాన్‌ చేయడం కూడా ప్రమాదకరం. టైర్‌ ఉపరితలంపై పగుళ్లు లేదా ఎక్కువగా అరిగిపోయిన గుర్తులు కనిపిస్తే వెంటనే మార్చించడం మంచిది. స్టెప్‌నీ పరిస్థితిని కూడా తప్పకుండా పరిశీలించాలి. సరైన కండిషన్‌లో ఉన్న టైర్‌ను మాత్రమే అదనపు టైర్‌గా వెంట తీసుకెళ్లడం సురక్షితం.

స్మార్ట్‌ డ్రైవర్స్‌ బ్రేక్స్‌ తీసుకుంటారు
లాంగ్‌ జర్నీలో ఆగకుండా డ్రైవ్‌ చేయడం కన్నా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి చిన్న చిన్నబ్రేక్స్‌ తీసుకోవడం బెటర్‌. కార్‌ ఇంజిన్‌ కూల్‌ అవుతుంది. టైర్స్‌కి కూడా రెస్ట్‌ దొరుకుతుంది. మీకు కూడా కాస్త బాడీని స్ట్రెచ్‌ చేసుకుని టీ బ్రేక్‌ ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది.

రోడ్‌ ట్రిప్‌ మెమోరీస్‌ బ్యూటిఫుల్‌గా ఉండాలి అంటే డెస్టినేషన్‌ కన్నా ముందు బండి కండిషన్‌ చాలా ఇం΄ార్టెంట్‌. బండి భద్రం.. ప్రయాణం సురక్షితం. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement