ఈ జీవుల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..! | Surprising Facts About Turtles Octopuses And Jellyfish | Sakshi
Sakshi News home page

ఈ జీవుల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!

Jun 1 2026 11:09 AM | Updated on Jun 1 2026 11:09 AM

Surprising Facts About Turtles Octopuses And Jellyfish

అవునా!

పిల్లలూ! సాధారణంగా జీవులన్నింటికీ కళ్ళు, చెవులు, గుండె, రక్తం వంటివి ఉంటాయని మనకు తెలుసు. కానీ, వీటికి భిన్నంగా ఉండే కొన్ని జీవుల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే!

  • నోరు ఉంటే పళ్ళు ఉండటం సహజం, కానీ తాబేలుకు పళ్ళు అస్సలు ఉండవు.
  • మనల్ని ఎంతగానో భయపెట్టే పాములకు బాహ్య చెవులు ఉండవు.
  • రైతు బంధువుగా పేరొందిన వానపాముకు కళ్ళు ఉండవు.
  • రోజంతా కష్టపడే చీమలకు నోటిలో నాలుక ఉండదు.
  • సాధారణంగా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ మన ఇళ్లలో తిరిగే బొద్దింకలకు తెల్లటి రక్తం ఉంటుంది.
  • సముద్ర గర్భంలో ఉండే అక్టోపస్‌ శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు.
  • సముద్రంలో కనిపించే అందమైన జెల్లీఫిష్‌లకు అటు తల గానీ, ఇటు గుండె గానీ ఉండవు.
  • అత్యధికంగా 32 మెదళ్లు (మెదడు లాంటి నరాల కణాల కేంద్రాలు) ఉండే జీవి ‘జెలగ’.

Advertisement
 
Advertisement
Advertisement