రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌, పొద్దున్నే ఇది తాగుతుందట | Sakshi
Sakshi News home page

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌, పొద్దున్నే ఇది తాగుతుందట

Published Mon, Dec 18 2023 3:35 PM

Rakul Preet Singh Favourite Ghee Coffee Recipe Benefits - Sakshi

కాఫీ అంటే తెలియని వారు ఉండరేమో. చాలామందికి పొద్దున్నే కాఫీ తాగనిదే రోజు గడవదు. బెడ్‌ మీద నుంచి లేవడంతోనే కాఫీతో డే స్టార్ట్‌ చేస్తారు. కాఫీ తాగడం మంచిదే కానీ, కొందరు అదే పనిగా రోజుకు 4-5సార్లు కాఫీని ఎనర్జీ డ్రింక్‌లా తాగేస్తుంటారు.

అయితే ఇదంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుంటారు. కాఫీలో కోల్డ్‌ కాఫీ, ఫిల్టర్‌ కాఫీ, బ్లాక్‌ కాఫీ.. ఇలా చాలా రకాలున్నా నెయ్యి కాఫీ అన్నింటికంటే ది బెస్ట్‌ అంటున్నారు. అందుకే ఎంతోమంది సెలబ్రిటీల రొటీన్‌లో నెయ్యి కాఫీ ముందుంటుంది. 


నెయ్యి కాఫీ(Ghee Coffee)వినడానికి కాంత కొత్తగా అనిపించినా ఇప్పుడు సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ట్రెండ్‌ ఇదే. నెయ్యి కాఫీ తాగడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్‌ అయ్యింది. ప్రముఖ సెలబ్రిటీలు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, భూమి ఫడ్నేకర్‌ ఇప్పటికే చాలాసార్లు సోషల్‌ మీడియాలో తమ డే రొటీన్‌లో నెయ్యి కాఫీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది చూద్దాం. 

  • నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అసిడిటీని దూరం చేయడంలో తోడ్పడుతుంది.
  • నెయ్యిలో విటమిన్‌-ఇ, ఎ,కె లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 
  • మొండి కొవ్వులను కరిగించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. 
  • నెయ్యిలో ఒమేగా 3, 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 
  • పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
  • నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫేవరెట్‌ రెసిపి
నెయ్యి కాఫీతోనే తన రోజు మొదలవుతుందని ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మంచి కొవ్వుతో పాటు చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. మరి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ కాఫీని ఎలా తయారు చేసుకుంటుంది? ఏమేం వాడుతుందంటే...

ముందుగా గ్లాస్‌లో ఒక స్పూన్‌ దేశీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్‌కి పైగా కాఫీ పౌడర్‌, కొలాజిన్‌ను జత చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే చిటికెలో నెయ్యి కాఫీ రెడీ అయినట్లే

► ఒకవేళ మీరు చక్కెర వేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా స్వీటెనర్ వేసుకోవచ్చు. లేదా 2-3 యాలకులు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కాసిన్ని పాలు కూడా జత చేసుకోవచ్చు. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు పాలకు బదులుగా కేవలం వేడినీళ్లు వేసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ పరగడుపున నెయ్యి కాఫీ తాగడం వల్ల నెలరోజుల్లోనే రిజల్ట్‌ కనిపిస్తుంది. 

Advertisement
 
Advertisement