
బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పిండమే లక్ష్యంగా హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో పింక్‌థాన్ రన్ నిర్వహించనున్నారు. జైడస్ లైఫ్‌సైన్సెస్ ఆధ్వర్యంలో డిసెంబరు 21న నిర్వహించనున్న ఈ రన్‌లో 30 వేల మందికి పైగా మహిళలు పాల్గోనున్నారని, ఇందులో అల్ట్రా రన్స్, రీలే రన్ ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రతి నెల మూడు నిమిషాల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ మహిళల ప్రాణాలను రొమ్ము కేన్సర్ నుంచి కాపాడగలదని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరి్వల్ పటేల్ తెలిపారు. పింక్‌థాన్‌తో మరింత మందిని చైతన్యపరచడమే లక్ష్యమన్నారు. దేశంలో యేటా రెండు లక్షల మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బాధితులు అవుతున్నారని ఫిట్‌నెస్ ఐకాన్ పింక్‌థాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ అన్నారు.
27న నేచర్ క్యాంప్
ఫారెస్ట్ ట్రెక్‌పార్కులో నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్‌పార్కులో 27 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకూ నేచర్ క్యాంప్ ఉంటుందని తెలిపారు.
టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నోక్టర్నల్ వాక్, నైట్æ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, బర్డ్ వాచింగ్ ఉంటాయన్నారు. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో బర్డ్ వాక్‌లో పిల్లలు, పెద్దలు పక్షుల జాతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 73823–07476, 94935–49399లను సంప్రదించాలని సూచించారు.
(చదవండి: 'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!)