బ్లాక్‌​ అండ్‌ వైట్‌ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే? | Parineeti Chopra Ethnic Glamour In Rs 30k Colour Block Saree | Sakshi
Sakshi News home page

బ్లాక్‌​ అండ్‌ వైట్‌ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే?

Apr 8 2024 12:36 PM | Updated on Apr 8 2024 1:25 PM

Parineeti Chopra Ethnic Glamour In Rs 30k Colour Block Saree  - Sakshi

బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన నటి. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్‌, నేషనల్‌ ఫిల్మ్‌ ఫేర్‌ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్‌ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్‌​ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్‌ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలో అడుగుపెట్టింది. అయినప్పటికీ కెరీర్‌ పరంగా దూసుకుపోతుంది పరిణితి.

తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్‌లో భాగంగా పరిణితి బ్లాక్‌ అండ్‌ వైట్‌ చీరలో గ్లామరస్‌ లుక్‌లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చీరలో సౌందర్యం అంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఉంది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్‌బ్లౌజ్‌ జత చేయడం ఆమెకు మరింత అందాన్నితెచ్చి పెట్టింది . పూలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి.

చాలా సింపుల్‌గా జస్ట్‌ చెవులకు మాత్రమే డైమెండ్‌లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్‌ మేకప్‌తో కళ్లను హైలెట్‌ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్‌ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్‌కి చెందింది. ఈ బ్రాండ్‌ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్‌తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. 

(చదవండి: గ్లామరస్‌ క్వీన్‌ దీపిక బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement