ఉచిత పోషకాహార శిబిరం | National Nutrition Week 2025: Free nutrition camp At Hyderabad | Sakshi
Sakshi News home page

ఉచిత పోషకాహార శిబిరం

Sep 7 2025 8:24 AM | Updated on Sep 7 2025 8:24 AM

National Nutrition Week 2025: Free nutrition camp At Hyderabad

నేషనల్ న్యూ ట్రిషన్ వీక్ సందర్భంగా ఆలివ్  ఆస్పత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు ఉచిత పోషకాహార శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో పాల్గొనే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిపుణుల సలహాలు, వ్యక్తిగత డైట్ ప్లాన్‌లు అందిచనున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేస్తున్న  విటమిన్ లోపాలు — అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, శక్తి లోపం వంటి సమస్యలపై వైద్యులు, పోషకాహార నిపుణులు దృష్టి సారించి సులభమైన ఆహార మార్పులపై మార్గదర్శనం ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సుగ్రా ఫాతిమా, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్‌ న్యూ ట్రిషనిస్ట్ మాట్లాడుతూ...“ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే అనేక జీవనశైలి సమస్యలను నివారించవచ్చు. ఈ న్యూట్రిషన్ వీక్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన పోషకాహార ప్రాధాన్యతను నగర వాసులకు తెలీయజేయడమే" అని అన్నా రు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, ఉచిత పరీక్షలు, సలహాలను పొంది ఆరోగ్యకరమైన జీవనానికి తొలి అడుగు వేయాలని ఆలివ్ హాస్పి టల్ యాజమాన్యం కోరింది.

(చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement