breaking news
nutrition weak festivals
-
ఉచిత పోషకాహార శిబిరం
నేషనల్ న్యూ ట్రిషన్ వీక్ సందర్భంగా ఆలివ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు ఉచిత పోషకాహార శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో పాల్గొనే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిపుణుల సలహాలు, వ్యక్తిగత డైట్ ప్లాన్లు అందిచనున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేస్తున్న విటమిన్ లోపాలు — అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, శక్తి లోపం వంటి సమస్యలపై వైద్యులు, పోషకాహార నిపుణులు దృష్టి సారించి సులభమైన ఆహార మార్పులపై మార్గదర్శనం ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ సుగ్రా ఫాతిమా, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ న్యూ ట్రిషనిస్ట్ మాట్లాడుతూ...“ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే అనేక జీవనశైలి సమస్యలను నివారించవచ్చు. ఈ న్యూట్రిషన్ వీక్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన పోషకాహార ప్రాధాన్యతను నగర వాసులకు తెలీయజేయడమే" అని అన్నా రు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, ఉచిత పరీక్షలు, సలహాలను పొంది ఆరోగ్యకరమైన జీవనానికి తొలి అడుగు వేయాలని ఆలివ్ హాస్పి టల్ యాజమాన్యం కోరింది.(చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
అరవైల్లోనూ యవ్వనంగా!
అరవై ఏళ్లు దాటిన కొందరు సెలబ్రిటీలను, వారి ఫిట్నెస్ చూసి చాలా మంది ‘వయసును ఆపేశారు’ అని మాట్లాడుకోవడం చూస్తుంటాం. వారు తీసుకునే పోషకాహారం, వ్యాయామం, చేసే పనుల నిర్వహణ ఇంకా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అరవై ఏళ్ల వయసు పై బడిన వారు ఇక జీవితం అయి΄ోయిందని అనుకోకుండా తమ రోజువారీ తీసుకునే ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగానూ, పనుల నిర్వహణలోనూ ఉత్సాహంగా ఉంటారు.రోజువారీగా తీసుకోవాల్సిన...కేలరీలు: 1500–1700ప్రొటీన్లు: పురుషులు – రోజుకు 54 గ్రా‘‘ మహిళలు – రోజుకు 45గ్రా‘‘ నాణ్యమైన ప్రొటీన్ కోసం: ఉడికించిన గుడ్డు, పాలు, కోడి మాంసం, చేపలు, పప్పు దినుసులుకొవ్వులు: రోజుకు 25.గ్రా (ఆరోగ్యకరమైన కొవ్వులు – 1 టేబుల్ స్పూన్ నూనె, గింజలు, నువ్వులు)కార్బోహైడ్రేట్లు: మొత్తం కాలరీలలో 45–65% విటమిన్లు, ఖనిజాలువిటమిన్–ఎ: 840–1000 మైక్రోగ్రాములువిటమిన్– ఇ: రోజుకు 65 మి.గ్రా‘‘క్యాల్షియం: రోజుకు 1200 మి.గ్రా‘‘ఐరన్: రోజుకు 11–19 మి.గ్రా‘‘ఫుడ్ గ్రూఫ్స్ పండ్లు: రోజుకు 1–2 సర్వింగ్స్ (మీడియం సైజు ఉన్న పండు)కూరగాయలు: రోజుకు 3–4 సర్వింగ్స్ (వంట చేసినవి లేదా ఉడికించినవి)ధాన్యాలు: రోజుకు 6–8 సర్వింగ్స్ (1 కప్పు = 30గ్రా) అన్నం, సజ్జలు, లేదా గోధుమ నూకడైరీ ఉత్పత్తులు: రోజుకు 2–3 సర్వింగ్స్ (పాలు, పెరుగు, పనీర్)సాధారణంగా రోజూ ఈ కాంబినేషన్లో ఆహారం ఉండేలా చూసుకోవాలి.రోజువారీ భోజన ప్రణాళిక...బ్రేక్ఫాస్ట్ఇడ్లీ (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఉప్మా (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఓట్స్ / కిచిడీ (60గ్రా.) + ఉడికించిన గుడ్డు తెల్లసొనమధ్యాహ్న భోజనం1 కప్పు బియ్యం / బ్రౌన్ రైస్1 జొన్న/రాగి ఫుల్కా (25గ్రా‘‘)1 కప్పు తోటకూర పప్పు1 కప్పు కాకర కాయ కూర / ఇతర కూరస్నాక్స్ఆపిల్ / కివి / కమలపండుకొద్దిగా నానబెట్టిన గింజలు కొబ్బరి నీళ్లుఈవెనింగ్ స్నాక్స్1 కప్పు చికెన్ సూప్ / వెజిటబుల్ సూప్ / మజ్జిగరాత్రి భోజనం1 కప్పు అన్నం / బ్రౌన్ రైస్ / కిచిడీ లేదా 1 ఫుల్కా1 కప్పు పాలక్ పనీర్ కూర / పలుచని పప్పు/ ఏదైనా ఒక కూర (చదవండి: మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!) -
అంగట్లో అంగన్ వాడీ సరుకులు!
సుభద్ర(బలిజిపేట రూరల్): ఒక వైపు పౌష్టికాహార వారోత్సవాలు.. మరోవైపు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించాల్సిన సరుకులు అంగడికి తరలిపోతున్నాయి. ఇదేమని అడిగితే సాక్షాత్తు అంగన్వాడీ కార్యకర్తే బియ్యం తానే అమ్మానని సమాధానమివ్వడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సుభద్ర ఒకటవనంబరు అంగన్వాడీ కేంద్రం నుంచి అక్రమంగా అంగట్లోకి తరలిస్తున్న 50 కిలోల బియ్యాన్ని గ్రామస్తులు శుక్రవారం పట్టుకున్నా రు. మండలంలోని పక్కి గ్రామానికి చెందిన వ్యాపారి గ్రా మంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి బియ్యాన్ని తెస్తుండ గా పట్టుకున్నామని గ్రామస్తులు కర్రి అచ్యుతరావు, రంభ.కృష్ణ, చన్నమల్లి మహేష్, గంట ఎల్లనాయుడులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాన్ని సక్రమంగా తెరవడం లేద ని, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని గ్రామంలోని చిన్న పిల్లల తల్లితండ్రులు తెలిపారు. కార్యకర్త నెలకు 20రోజులు గ్రామంలో ఉండదని మిగిలిన 10 రోజులు వచ్చినా సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ఇటువంటి కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. ఆ వ్యాపారి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తే బియ్యం విక్రయ వివరాలు చాలావర కు దొరికే అవకాశాలున్నాయని గ్రామస్తులు చెప్పారు. కేంద్రంలో ప్రీ స్కూలు పిల్లలు 21 మంది, ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వారు 25 మంది, గర్భిణి ఒకరు, బా లింతలు ఆరుగురు ఉన్నట్టు రికార్డులలో చూపుతున్నారు. కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంట ల వరకు నిర్వహించాల్పి ఉన్నప్పటికీ పిల్లలు లేక కేంద్రం వెలవెలబోతోంది. దీనిపై కార్యకర్త జి.హైమావతిని వివరణ కోరగా బియ్యం తానే అమ్మానని ఒప్పుకున్నారు. ‘హాజరు పట్టిలో 5వ తేదీ నాటి హాజరు వేయలేదు. ప్రీస్కూ లు విద్యార్థులకు వంటవండలేదని’ స్పష్టం చేశారు. మరికొన్ని బియ్యం తడిసి ముద్దయి పాడయ్యాయన్నారు.