ఫిట్‌నెస్‌... ఫర్‌ స్ట్రెస్‌! | Milind Soman's Life Story Of Making An Impact Through Fitness | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌... ఫర్‌ స్ట్రెస్‌!

May 30 2026 7:44 AM | Updated on May 30 2026 11:34 AM

Milind Soman's Life Story Of Making An Impact Through Fitness

‘హి’..  స్టోరీ

గ్లామర్‌ రంగంలో ఉంటూ ఫిట్‌నెస్‌ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్‌ సోమన్‌ ఒకరు. చాలామందికి రిటైర్‌ మెంట్‌ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.

‘యూరప్‌ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మిళింద్‌ సోమన్‌. బాడీ ఫిట్‌నెస్‌తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్‌. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.

సూపర్‌ మోడల్‌ టూ సూపర్‌ రన్నర్‌...
ఆయన ప్రయాణం 1990లలో సూపర్‌ మోడల్‌గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్‌ , ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్, డిసెంబర్‌ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్‌ ట్రాక్‌ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్‌నెస్‌కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్‌.

పింక్‌థాన్‌.. మహిళలకు ఇన్‌స్పిరేషన్‌
ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్‌లు, ఫిట్‌నెస్‌ ఈవెంట్స్‌కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్‌ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్‌లు కలిసి ప్రారంభించిన పింక్‌థాన్‌ ఈవెంట్‌ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్‌ ఈవెంట్‌ గా అవతరించింది.

హిట్‌... ఫిట్‌... ఫీట్స్‌ ఎన్నో...

  • 50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరిగిన ఐర¯Œ మ్యాన్‌ ట్రయాథ్లాన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్‌ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.

  • 2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.

సిక్స్‌ ΄్యాక్‌ కాదు... స్ట్రెస్‌ బ్యాక్‌ ముఖ్యం
కండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్‌. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్‌లకు వెళ్లడానికి బదులు పుష్‌–అప్స్‌ పుల్‌–అప్స్‌ వంటి సహజమైన బాడీ వెయిట్‌ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.

  • 30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.

  • 59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్‌. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement