డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం... 139 విఫలయత్నాలు | Man passes driving test after 139 attempts in nine years | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం... 139 విఫలయత్నాలు

Apr 19 2026 12:20 AM | Updated on Apr 19 2026 11:17 AM

Man passes driving test after 139 attempts in nine years

సాధారణంగా మనం డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే థియరీ, ప్రాక్టికల్‌ టెస్ట్‌లలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేస్తాం. అలా సాధ్యం కాకపోతే ‘ఇక మనకు డ్రైవింగ్‌ సెట్‌ కాదులే’ అని అనుకుని ఏ ఓలానో, ఊబర్‌నో ఆశ్రయిస్తాం. కానీ పోలండ్‌లోని టార్నోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకుంటున్నారా... ఏకంగా 139 సార్లు, తొమ్మిదేళ్ల పాటు విసుగు చెందకుండా విఫల యత్నాలు చేశాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ థియరీ టెస్ట్‌లో పాస్‌ కావడం కోసం ఏకంగా రూ. 1,90,000 కూడా ఖర్చు చేశాడు.

చివరికి అంటే 140వ ప్రయత్నంలో ఎట్టకేలకు థియరీ టెస్ట్‌లో పాసయ్యాడు. అయితే, అసలైన మరో ట్విస్ట్‌ మరొకటి ఉంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే థియరీ పాస్‌ అయిపోతే సరిపోదు. ప్రాక్టికల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ కూడా పాసై పోవాలి. కారు నడపడంలో తడబడినా, రివర్స్‌ సరిగ్గా తీయకపోయినా.. రూల్స్‌ ప్రకారం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. మరోవిషయం.. 140 సార్లే ఎక్కువ అనుకుంటే, పోలండ్‌లోనే ఇతడిని మించిన ఇంకో ఘనుడు కూడా ఉన్నాడు. అతను డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఏకంగా 163 ప్రయత్నాలు చేశాడట. అది కూడా 17 ఏళ్ల పాటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement