
కుటుంబంలో ఒక్కరు సక్సెస్ సాధిస్తే..ఆ తర్వాత తరాలకు వాళ్లు ఆదర్శంగా మారడమే కాదు వారిలా అధికారుల పరంపరను కొనసాగిస్తారు కొందరు. అలా వారసత్వాన్ని కొనసాగించడం అనేది అరుదు కూడా. అలా కంటిన్యూస్‌గా వారసత్వాన్ని అందిపుచుకుని కొనసాగడమే గాక, ఒకే కుంటుంబంలోని రెండు జనరేషన్‌లు వరుసగా కొనసాగడం అనేది అత్యంత అరుదు. అలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకోవడమే కాదు, చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలవనుంది ఈ అరుదైన ఘటన.
ఏం జరిగిందంటే..లెఫ్టినెంట్ పారుల్ ధద్వాల్ ఐదు తరాలుగా ఆర్మీసేవలందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఆమె తన కుటుంబంలోని ఐదోతరం ఆర్మీ అధికారిగా కొనసాగనున్నారు.
చెన్నైలోని ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌లో చేరారు. ఆమె తన అంకితభావం, నైపుణ్యానికి గుర్తింపుగా ఈ ట్రైనింగ్ కోర్సులో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో తొలి స్థానంలో నిలిచి రాష్ట్రపతి బంగారు పతకాన్ని కూడా సొంతం చేసుకున్నారు.
పారుల్ ధద్వాల్ నేపథ్యం..
ఆమె పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని జనౌరి గ్రామం నుండి వచ్చింది. ఈ ప్రాంతం యుద్ధానికి సంబంధించిన వీరసైనికుల నిలయంగా పేరుగాంచింది. ఇక పారల్ ధద్వాల్ కుటుంబ ఆర్మీలో ముత్తాతల కాలం నుచి సేవలందిస్తోంది. ఆమె ముత్తాత సుబేదార్ హర్నామ్ సింగ్ జనవరి 1, 1896 నుంచి జూలై 16, 1924 వరకు సేవలందించారు.
ఆమె రెండో ముత్తాత ఎల్ఎస్ ధద్వాల్ 3 JATతో పనిచేశారు. మూడోతరంలో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్‌కు చెందిన కల్నల్ దల్జిత్ సింగ్ ధద్వాల్ 3 కుమాన్‌కు చెందిన బ్రిగేడియర్ జగత్ జామ్వాల్‌లో ఉన్నారు. ఇక ఆమె తండ్రి మేజర్ జనరల్ కేఎస్ ధద్వాల్ ఎస్‌ఎమ్ విశిష్ట సేవా మెడల్ గ్రహిత. ప్రస్తుతం ఆమె తన సోదరుడు కెప్టెన్ ధనంజయ్ ధద్వాల్‌లతో కొనసాగుతోంది.
వీరిద్దరు 20 మంది అత్యున్నత సిక్కు అధికారుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అదీగాక ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలకు చెందిన ముగ్గురు అధికారులు దేశానికి సేవలందిస్తున్న అరుదైన ఘటన ఇది. ఈ ఘటన దేశం పట్ల ఉన్న వారి శాశ్వత నిబద్ధతకు తార్కాణంగా నిలిచింది.
A Legacy of Five Generations
One Uniform – Infinite Pride
The journey of Lt Parul Dhadwal is a saga of a family dedicated to service to the Motherland. A proud descendant of a long lineage of brave soldiers, she represents the fifth-generation who now dons the Olive Green in… pic.twitter.com/3BtXn8SlT8— ADG PI - INDIAN ARMY (@adgpi) September 6, 2025