ప్రపంచ ఐస్‌క్రీమ్‌కే రాజధాని | Le Mars, Iowa: Ice Cream Capital of the World | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఐస్‌క్రీమ్‌కే రాజధాని

May 25 2026 3:17 PM | Updated on May 25 2026 3:17 PM

 Le Mars, Iowa: Ice Cream Capital of the World

ఎండాకాలం అంటే మన మైండ్‌లో ముందుగా ఫ్లాష్‌ అయ్యే ఇమేజ్‌ ఏంటి? వేడెక్కిన రోడ్లు, వడగాలుల మధ్య చేతిలో చల్లని ఐస్‌క్రీమ్‌. అయితే ప్రపంచంలో ఐస్‌క్రీమ్‌కు కూడా ఒక రాజధాని ఉంది అని దానిని ఐస్‌ క్రీమ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అని పిలుస్తారని తెలుసా?

అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ‘లే మార్స్‌’ అనే స్మాల్‌ టౌన్‌ ఈ స్పెషల్‌ టైటిల్‌తో వరల్డ్‌ వైడ్‌ ఫేమస్‌ అయింది. ఈ పట్టణం చిన్నది అయినా అక్కడి ఐస్‌క్రీమ్‌ క్రేజ్‌ మాత్రం మామూలుగా ఉండదు. అక్కడ వీధుల్లో నడుస్తుంటే కూడా స్వీట్‌ వెనీల్లా సువాసన వస్తుంది అని టూరిస్టులు చెబుతారు.

బ్లూ బన్నీ స్టోరీతో ఫేమస్‌ అయిన స్టోర్‌
లే మార్స్‌ ΄పాపులారిటీ వెనక అతిపెద్ద కారణం వచ్చేసి వెల్స్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అనే కంపెనీ. ఈ సంస్థ నడిపించే బ్లూ బన్నీ అనే ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ చాలా పాపులర్‌ అయింది. కొన్ని దశాబ్దాల నుంచి ఐస్‌క్రీమ్‌ ప్రొడ్యూస్‌ చేస్తూ ఈ చిన్న పట్టణాన్ని అంతర్జాతీయ డెసెర్ట్‌ మ్యాపులో పెట్టింది ఈ సంస్థే.

ప్రతీ రోజు ఇక్కడ భారీ పరిమాణంలో ఐస్‌క్రీమ్‌ ప్రిపేర్‌ చేస్తారు. వెనీల్లా, స్ట్రాబెర్రీ, చాకొలేట్, కేరామెల్‌ం సింపుల్‌ ఫ్లేవర్స్‌ నుంచి కలర్‌ఫుల్‌ క్రేజీ కాంబినేషన్స్‌ వరకు ఇక్కడ ఎన్నో ఆప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఐస్‌క్రీమ్‌ అనేది జస్ట్‌ ఫుడ్‌ మాత్రమే కాదుం లోకల్‌ కల్చర్‌లో ఒక పార్ట్‌లా ఫీల్‌ అవుతుంది.

ఫ్రోజెన్‌ కార్నివాల్‌ వైబ్‌
లే మార్స్‌ వీధుల్లో ఐస్‌క్రీమ్‌ థీమ్‌ అనేది ప్రతీ చోట కనిపిస్తుంది. క్యూట్‌ ΄ార్లర్స్, డెజర్ట్‌ కేఫ్స్, జయంట్‌ స్కూప్‌ స్టాట్యూలు, కలర్‌ఫుల్‌ బోర్డులుం సిటీ మొత్తం ఒక ఫ్రోజెన్‌ కార్నివాల్‌లా ఉంటుంది. విజిటర్స్‌ కోసం స్పెషల్‌గా ఐస్‌ క్రీమ్‌ మ్యూజియం, ఫ్యాక్టరీ టూర్స్, టేస్టింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కూడా అరేంజ్‌ చేస్తారు. 

ట్రావెల్‌ లవర్స్‌కి లే మార్స్‌ అనేది నార్మల్‌ ఫుడ్‌ డెస్టినేషన్‌ కాదు. చైల్డ్‌హుడ్‌ సమ్మర్‌ మెమోరీస్‌ని ఫ్రీజర్‌లో ప్రిజర్వ్‌ చేసినట్టు అనిపించే స్వీట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. మన దగ్గర మ్యాంగో సీజన్‌ కోసం వెయిట్‌ చేస్తాము. కానీ అక్కడ ప్రతీ రోజు ఒక ఐస్‌క్రీమ్‌ సీజన్‌లాగే ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement