నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్‌ ప్రతిభ ఇంట్రస్టింగ్‌ జర్నీ | Laapataa Ladies Pratibha Ranta On Her Journey In Bollywood | Sakshi
Sakshi News home page

నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్‌ ప్రతిభ ఇంట్రస్టింగ్‌ జర్నీ

Published Fri, May 10 2024 4:19 PM | Last Updated on Fri, May 10 2024 6:08 PM

Laapataa Ladies Pratibha Ranta On Her Journey In Bollywood

బాలీవుడ్‌ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్‌ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు,  అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన  సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన  ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది.  సిమ్లా టూ బాలీవుడ్‌ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్‌ జర్నీ ఒక సారి చూద్దాం.

ఖుర్బాన్‌ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్‌ చేస్తుండగా కిరణ్‌ రావు దృష్టిలో పడింది. అలాలాపతా  లేడీస్‌లో అవకాశం వచ్చింది.  వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. 

బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్‌ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్‌తో, ముఖ్యంగా  లాపతా  లేడీస్‌ 'జయ' పాత్రలో సత్తా  చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్‌లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో  చాలా తక్కువ  సమయంలోనే తనకంటూ  ఒక ఇమేజ్‌  క్రియేట్‌ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.

ఎవరీ ప్రతిభా  రాంటా
సందేశనా రాంటా,, రాజేశ్‌ రాంటా దంపతుల కుమార్తె  ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్‌ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్‌ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని  ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.

పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్‌లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది.  2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్‌ ముంబై అందాల పోటీల్లో మిస్‌ ముంబై కిరీటం గెలుచుకుంది.  దీంతో  కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్‌ హువా’ టీవీ సీరియల్‌ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్‌ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది.

ఇక లాపతా లేడీస్‌ ఆఫర్‌ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ  ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement