
ఇన్నోవేషన్
‘ఆడుతూ పాడుతూ కూడా చదువు హాయిగా నేర్చుకోవచ్చు’ అంటాడు అక్షయ్ మసెల్కర్. ఉత్తర కర్నాటకలోని సిర్సి జిల్లాకు చెందిన అక్షయ్, బడి అంటే దూరంగా పారిపోయే విద్యార్థుల కోసం హ్యుమనాయిడ్ రోబోను తయారు చేశాడు. దానికి ‘శిక్షణ’ అని పేరు పెట్టాడు.
ఎంత టీచర్ అయినప్పటికీ ‘శిక్షణ’ రూపం అచ్చం విద్యార్థిలాగే ఉంటుంది. ఒకటి నుంచి నాల్గో తరగతి విద్యార్థుల కోసం రూ΄÷ందించిన ఈ రోబో టీచర్ పిల్లలను నవ్విస్తూనే కన్నడ, ఇంగ్లీష్ భాషలలో పాఠాలు చెబుతుంది. గేయాలు పాడుతుంది. మాథ్స్ సులువుగా నేర్పిస్తుంది. ΄÷డుపు కథలు వేస్తుంది. ఒకటా రెండా... ఎన్నో ఎన్నెన్నో!}
ఈ రోబో పుణ్యమా అని బడికి దూరంగా ఉండే పిల్లలు కూడా బడికి ఇష్టంగా రావడం విశేషం. తమ రోబో టీచర్‌కు సంబంధించిన విషయాలను రోజూ ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతుంటారు.}
అక్షయ్ తల్లి టీచర్‌గా పనిచేసేది. తానూ టీచర్ కావాలనుకోవడానికి అమ్మే స్ఫూర్తి. డిగ్రీ పూర్తయిన తరువాత ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు అక్షయ్.
లెక్చరర్‌గా పనిచేస్తున్న కాలంలో విద్యావిధానం గురించి ఆలోచించేవాడు. ఈ క్రమంలోనే అతడికి కొత్త కొత్త ఐడియాలు వస్తుండేవి. అయితే తనకు వచ్చే వినూత్న ఆలోచనలను సాకారం చేసుకునే సమయం ఉండేది కాదు.
కోవిడ్ కల్లోల కాలంలో బోలెడంత తీరిక దొరకడంతో తన ఐడియాలపై పనిచేసే అవకాశం వచ్చింది. పల్లెటూరు బడుల నుంచి పట్నం బడుల వరకు చాలా బడులలో బోధనకు సంబంధించిన శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం లేదని, డ్రాయింగ్ చార్ట్‌లు, బ్లాక్‌బోర్డ్ తప్ప ఇతరత్రా ఉపకరణాలను ఉ పాధ్యాయులు ఉపయోగించడం లేదని గ్రహించాడు అక్షయ్.
‘మొక్కుబడిగా బోధించడం కాకుండా వినూత్నమైన పద్ధతుల్లో విద్యార్థులకు చేరువ కావాలి’ అనుకున్న అక్షయ్ సంవత్సరానికి పైగా పరిశోధనలు చేశాడు. సంప్రదాయ బోధన, ఆధునిక సాంకేతికతను కలిపి రోబో టీచర్‌ను తయారుచేశాడు. ఈ రోబోను తయారు చేయడానికి రెండు లక్షల రూ పాయలు ఖర్చు అయింది. ఈ ఖర్చును తానే స్వయంగా భరించాడు.
ఈ రోబోలో రెండు కార్డులు ఉంటాయి. మాస్టర్‌కార్డ్ అన్‌లాక్ కోసం, నార్మల్ కార్డ్ ఇష్టమైన ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. మొదట్లో ఈ రోబ్‌ను 25 స్కూల్స్‌లో ఉపయోగించారు. ఆ తరువాత మరిన్ని స్కూల్స్‌కు విస్తరించారు.
‘రోబో టీచర్‌ను అక్షయ్ మాకు పరిచయం చేశారు. చాలా ఆసక్తిగా అనిపించింది. పిల్లలైతే ఎంతో సంతోషించారు. క్లాసులో కదలకుండా కూర్చుంటున్నారు. వారికి ఇది రోబో కాదు టీచర్, ఫ్రెండ్. పిల్లలకు మాత్రమే కాదు ఉ పాధ్యాయులకు కూడా రోబో ఎంతో ఉపయోగపడుతుంది. వారి భారాన్ని తగ్గిస్తోంది. సైన్స్, టెక్నాలజీ విషయాలపై ఆసక్తి పెంచుతుంది’ అంటుంది సిర్సిలోని మోడల్ హైయర్ ప్రైమరీ స్కూల్ సైన్స్, మ్యాథ్స్ టీచర్ సునైనా హెగ్డే.
‘శిక్షణ’ రోబో దగ్గర మాత్రమే ఆగిపోలేదు అక్షయ్. విద్యారంగంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణల కోసం ‘ఎక్స్‌పిర్‌మైండ్’ స్టార్టప్ ద్వారా కృషి చేస్తున్నాడు.
‘గ్రామీణ్ర పాంత పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయడమే కాదు భవిష్యత్‌లో వారు కూడా కొత్త ఆవిష్కరణలు చేసేలా స్ఫూర్తి కలిగించడం, ప్రోత్సహించడమే మా లక్ష్యం’ అంటున్నాడు అక్షయ్.