
విద్యానగర్(కరీంనగర్): నాటి అలిపిరాల నుంచి నేటి కరీంనగర్ వరకు శాతవాహనుల నుంచి కాకతీయల వరకు ఎందరో ఏలిన గడ్డ ఇది. ఎలగందుల కేంద్రంగా నిజాంల పాలన, ఉగ్గుపాలతో ఉద్యమాలను రంగరించిన వీరమాతలు, ఉరకలేత్తే చైతన్య సమరయోధుల గర్జన, చాళక్యుల కాలం నుంచి జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేకస్థానాన్ని నిలుపుకుంది. ఎలగందల్ జిల్లా అవల్ తాలుకుదార్ గోవింద్ నాయక్ కరీంనగర్‌లో 1918లో క్లాక్ టవర్ నిర్మించారు. 1935లో నిజాంపాలన రజతోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న నిజాం ప్రభువులకు స్వాగతం పలికేందుకు షేక్‌ఖాన్ స్వాగత ద్వారంగా కమాన్ నిర్మించారు.
చదవండి: గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!
1905కు ముందే పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కాగా.. ప్రస్తుతం కరీంనగర్ రూరల్‌స్టేషన్‌గా కొనసాగుతోంది. 1920లో మానేరు నదిపై రాతి వంతెన నిర్మాణం జరిగింది. 1958లో ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. 1956లో వేంకటేశ్వర ఆలయం దగ్గర తొలివాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది. 1956లో ప్రస్తుత మల్టీఫ్లెక్స్‌స్థానంలో పాతబస్‌స్టేషన్ ఉండేది. 1960 తర్వాత గాంధీ సెంటీనరీ మ్యూజియం, 1956 ఎస్సారార్, 1969లో సైన్సివింగ్ కాలేజీ, 1967లో జిల్లా ప్రధానాస్పత్రి, జిల్లా కోర్టు భవనాలు, 1973లో మహిళా డిగ్రీ కళాశాల, 1980లో కలెక్టరేట్, అంబేద్కర్ స్టేడియం, 1980లో ప్రస్తుత బస్టాండ్ నిర్మించారు. 1980 తర్వాత పురపాలక సంఘ భవనం, కళాభారతి నిర్మించారు. 1982లో ఎల్‌ఎండీ నిర్మాణం పూర్తయింది. 1994లో మానేరునదిపై కొత్త వంతెన నిర్మించారు. 2001లో ఉజ్వల పార్కు, 2004లో జింకల పార్కు నిర్మించారు.
ఇదీ చదవండి: స్కూల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు : అపూర్వ సహోదరులు
పాత నగర స్వరూపం
పాత పట్టణ ప్రాంతాలైన పాత జిర్రాబాయి పరిసరాలు, పాత బజార్, అహ్మద్‌పురా, బంజరుదొడ్డి, ఫతేపూరా, కుమ్మరి కాపువాడలు, మేదరివాడ, షా సాహెబ్ మొçహీల్లా, పద్మశాలి, బ్రహ్మణ వీధులు, బోయ, దోభీవాడ, సిక్కువాడ, ప్రకాశం గంజ్, పెద్ద గడియారం, అస్లాం మజీద్ రోడ్, జాఫ్రీరోడ్, తిలక్‌రోడ్ వాడలున్నాయి. ప్రస్తుత ఆంధ్రా బ్యాంక్ ప్రాంతం అజ్మత్‌పురా, గుర్రాలపై స్వారీ చేస్తూ విధులు నిర్వహించిన పోలీస్ జమేదార్లు నివసించే ప్రాంతం సవరన్ మొహాల్లాగా ఏర్పడింది. డాక్ బంగ్లా వెనుక ప్రాంతం ముకరంపురగా, మిషన్ హాస్పిటల్ ఎదుట క్రిస్టియన్‌కాలనీ, దాని వెనక కురుమవీధి ఏర్పడ్డాయి.
మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు..
1952లో 45వేల జనాభాతో కరీంనగర్ మూడోగ్రేడ్‌తో 24 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడింది. తొలి మున్సిపల్ చైర్మన్‌గా ఖాజాబషీరుదీ్దన్ ఉండగా ఆయన హయాంలోనే గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారింది. 1981–85 పాలకవర్గం కాలంలో గ్రేడ్–1, 1987లో కరీంనగర్ పరిధిలోని రాంపూర్, రాంనగర్ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిశాయి. 2005లో నగరపాలక సంస్థంగా అవతరించి, 66 డివిజన్లతో కొనసాగుతోంది. మొదటి మేయర్‌గా దేశివేని శంకర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రత్యేక పాలన సాగుతోంది. కరీంనగర్ ప్రస్తుతం అభివృద్ధి పథకంలో కొనసాగుతోంది. స్మార్ట్ సిటీగా నయాలుక్ సంతరించుకుంటోంది. శాతవాహన యునివర్సిటీ, రైల్వేస్టేషన్, కేబుల్‌బ్రిడ్జి, ఐటీ టవర్, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పడ్డాయి.