బరువు తగ్గాలంటే చక్కని డైట్‌లు, ఫోర్స్‌బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.
15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్‌లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్‌ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె.
వాకింగ్..
ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.
నీరు తాగడం..
నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.
ఫైబర్‌ను మర్చిపోవద్దు
ప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్‌ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ఇంట్లో వండిన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.
కేలరీ లోటు
తినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.
తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దిశా.
(చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..)


