76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్‌ సింపుల్‌ వ్యాయమాలతోటే.. | Fitness Coach Shares About How She Lost 20 Kg With Low Impact High Intensity Exercises, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్‌ సింపుల్‌ వ్యాయమాలతోటే..

May 31 2026 3:55 PM | Updated on May 31 2026 5:50 PM

Fitness Coach Shares She Lost 20 Kg With Low Impact High Intensity Exercises

బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్‌ సెషన్‌లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్‌ డైట్‌ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్‌లాస్‌ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.

అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు,  కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.

స్టాండింగ్ జాక్స్
తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.

స్టాండింగ్ హై నీస్
ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్‌ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్‌లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.

పల్స్ స్క్వాట్స్
ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్‌లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.

వాల్ క్లైంబర్
పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.

వివరాలకు ఈ వీడియోపై క్లిక్‌ చేయండి

(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement